ఒంటరిగా జాబ్ చేసుకుంటూ ఉన్న నా జీవితంలోకి ఒక నవ్వుల హరివిల్లులాగా ప్రవేశించింది. ప్రతి రోజూ నవ్వుతూ నవ్విస్తూ స్నేహం చేసింది. నాకు తెలీకుండానే నన్ను, నా గురించి పూర్తి వివరాలు సేకరించింది. ఈ లోపే తనంటే ఎక్కువ ఇష్టం పెరిగిపోయింది. తన మీద ప్రేమని నాతోనే చెప్పేలా చేసుకుంది. నాతో రెండు సంవత్సరాలు స్నేహం చేస్తూ ప్రేమించింది. నాతో చెప్పలేక తనకు నా మీద ఉన్న ఇష్టాన్ని ఇంకోలా చూపించింది. కొద్ది రోజులకు నేను తనకంటే రెండు సంవత్సరాలు చిన్న అని తెలిసింది. అయినప్పటికీ నేను ప్రేమించే తనకు నా ప్రేమని చెప్పాను. 'మొదట మా నాన్నని అడిగి ఒప్పించు చేసుకుంటా' అని అన్నది. అలా ఆరు నెలలు నన్ను నా ప్రేమని అర్ధం చేసుకుని నేను అంటే ఇష్టం అని నాతో అన్నింటిని చెప్పేసింది. నాకు చాలా దగ్గరయ్యింది. ఇంకో రెండు రోజుల్లో తన పుట్టినరోజు వస్తుంది. ఆ రోజు ఇంటికి వచ్చి వాళ్ల నాన్నని అడగాలని చెప్పింది. ఇంటికి పిలిచింది! ఎదురుగా వాళ్ల నాన్న కూర్చున్నాడు. అప్పుడే నేను నా మనసులో ఉన్నది చెప్పేశా.
తన నవ్వులు మళ్లీ చూడాలని ఉంది