భార్యను హతమార్చిన భర్త..
మూడో నెల గర్భిణీ అని కూడ కనికరం లేకుండా ఉరివెసి చంపిన భర్త..
కృష్ణాజిల్లా,పెడన.. కృత్తివెన్ను మండలం పడతడిక గ్రామంలో విషాదం..
బర్రె మదర్ తెరిసా( 22 )భర్త నాగేశ్వరరావు (28 )వీరిద్దరు
మూడు సంవత్సరాల క్రితం పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు పెళ్లయిన నాటినుండి భీమవరంలో జీవనం సాగిస్తున్నారు వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు
మదర్ తెరిసా నాగేశ్వరావు దంపతులు కులాంతర వివాహం చేసుకోవడంతో తరచూ వారి మధ్య గొడవలు వస్తా ఉండేవి
ఈ నేపథ్యంలో మదర్ తెరిసా ను భర్త నాగేశ్వరరావు ఉరివేసి చంపాడు అంటూ బంధువులు ఆరోపిస్తున్నారు మదర్ తెరిసా ఇప్పుడు మూడో నెల గర్భిణీ తో ఉన్నట్టు గుర్తించిన వైద్యులు జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్తే భార్యను కడతేర్చడం తో మృతురాలు తల్లి బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఈఘటన తొ ఆప్రాతం అంతా విషాదఛాయలు అలుముకున్నాయి..