*దిశ కేసులో నేరస్తుల దిక్కులేని కుక్కచావు*
*షాద్ నగర్ లో దిశ ఆత్మకు శాంతి*
*సజ్జనార్, ప్రకాష్ రెడ్డి, శ్రీధర్ కుమార్ జిందాబాద్ అంటూ ఎన్ కౌంటర్ వద్ద నినాదాలు*
*సీఎం కేసీఆర్ జిందాబాద్ అంటూ మరిన్ని నినాదాలు*
*ఎన్ కౌంటర్ స్థలి సమీపంలో మృతదేహాలను చూడటానికి తండోపతండాలుగా జనాలు*
*మీడియాను సైతం అనుమతించని పోలీసులు*
దిశ హత్యకేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. షాద్‌నగర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నలుగురు నిందితులు పారిపోయారు. పారిపోతున్న నిందితులపై పోలీసులు కాల్పులు జరపడంతో నలుగురు నిందితులు మృతి చెందారు.
దిశ కేసులోని నేరస్తులు నలుగురు దిక్కులేని కుక్క చావు చచ్చారు. గత నెల 27వ తేదీన వెటర్నరీ డాక్టర్‌పై అత్యాచారం చేసిన నిందితులు హత్య చేసి చటాన్‌పల్లి వద్ద బ్రిడ్జి కింద శవాన్ని కిరోసిన్ పోలీస్ కాల్చిన సంగతి తెలిసిందే.అదే ప్రదేశంలో పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రదేశంలో చీకటిగా ఉన్న పరిస్థితులను అనుకూలంగా చేసుకున్న నిందితులు పోలీసులపై దాడికి దిగారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. జైల్లో ఉన్నప్పుడు నిందితులను వేరువేరుగా ఉంచారు.నిందితులను ఘటనకు పాల్పడిన ప్రాంతానికి తీసుకురాగానే అరగంటపాటు విచారణ జరిగిన అనంతరం ఆరిఫ్ మొదట పోలీసులపై దాడి చేశాడు. అనంతరం మిగితా ముగ్గురు పోలీసులపై తిరగబడ్డారు. నిందితులు తుపాకులు లాక్కొని పారిపోతుండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు...
*తండోపతండాలుగా జనాలు*
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ శివారులోని చటాన్ పల్లి వద్ద నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో.. ఈ వార్త దావానంలా వ్యాపించింది. జనాలు తండోపతండాలుగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను, సంఘటన వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నించిన మీడియాకు ఆంక్షలు ఎదురయ్యాయి. మీడియాను సంఘటన స్థలంలో వెళ్లకుండా పోలీసులు నిషేధించారు. సంఘటన స్థలంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, డిసిపి ప్రకాష్ రెడ్డి, ఏసీపీ సురేందర్, సిఐ శ్రీధర్ కుమార్ జిందాబాద్ అంటూ జనాలు నినాదాలు చేశారు. ఎన్ కౌంటర్ జరిగినందుకు జనాల సంతోషానికి అవధులు లేకుండ పోయింది. 44వ నంబర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. జనాన్ని ఇంత పొద్దున్నే నియంత్రణ చేయడం పోలీసులకు పెద్ద సమస్యగా మారింది. సంఘటనా స్థలంలో తెలంగాణ సీఎం కేసీఆర్ జిందాబాద్ అనే నినాదాలు కూడా ఊపందుకున్నాయి.